How to Protect Bank Accounts from Cyber Attacks 2019

How to Protect Bank Accounts from Cyber Attacks 2019

How to Protect Bank Accounts from Cyber Attacks 2019
Source: pixabay.com


ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో మనం ఏ పని చెయ్యాలన్న ఇంటర్నెట్ పై ఆధార పడి ఉన్నాము మనం తినే ఆహారం నుండి వేసుకునే బట్టల వరకు online లోనే కొంట్టున్నాం. దీన్నే అలసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు మన బ్యాంక్ ఖాతాలను Hack చేస్తున్నారు, వీటికి సంబంధించిన కథనాలను రోజు మనం వార్త పత్రికలోనూ టీ.వి చానల్స్ లోనూ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం మన బ్యాంక్ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోకపోతే మాత్రం మన డబ్బు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం కాయం. మరి మన డబ్బు ను కోల్పోకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

మాయ మాటలను నమ్మకండి

మనకు ఎవ్వరైనా ఫోన్ చేసి మీరు లాటరీ లో ఒక లక్ష రూపాయలు గెలుచుకున్నారు అని చెప్తే చాలు ముందు వెనక ఏమి ఆలోచించ కుండా వాళ్ళు ఎం అడిగిన చేస్తూ ఉంటాం. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క నెంబర్ నీ వాళ్లకు చెప్తాం ఇక్కడే మీరు పప్పు లో కలు వేస్తున్నారు అని అర్థం చేసుకోండి ఎందుకు అంటే మీరు చెప్పిన సమాచారంతో వాళ్ళు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుని దొంగలిస్తారు. ఒక్కోసారి మేము మీ అధికారులను మీ ఖాతాలో కొంత డబ్బు వస్తుంది మీకు సంబంధించిన ఏటీఎం కార్డు డీటెయిల్స్ మాకు చెప్పండి అని అడుగుతారు.ఒకటి గుర్తుంచుకోండి ఏ బ్యాంకు అధికారి అయినా మీకు కాల్ చేసి మీ మీ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని అడగరు. అందుకే మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీస్ లకు సమాచారాన్ని అందజేయండి. మన బలహీనతలను ఆధారంగా చేసుకుని చాలా మంది మన బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావున ఇలాంటి కాల్స్ మరియు మెసేజ్ లు వస్తే రిజెక్ట్ చేయండి లేదా బ్లాక్ చేయండి.

వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టకండి

ఈ రోజుల్లో మనం ఫేస్బుక్ వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో రోజు ఉపయోగిస్తూనే ఉన్నాంచాలామంది వాళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పు. మీరు పోస్ట్ చేసే సమాచారం ద్వారా చాలామంది హ్యాకర్స్ మీ ఇష్టా ఆఇష్టాలను తెలుసుకొని మీకు కొన్ని ఫిషింగ్ లింక్ ని పంపిస్తారు ఒక్కసారి మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ నీ ఇచ్చినట్టయితే మీకు సంబంధించిన ఖాతాలను చాలా సులువుగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపై ఎప్పుడు నీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి అలాగే సోషల్ మీడియాలో వచ్చే లింక్ పై క్లిక్ చేయకండి.

మాల్వేర్ ఆప్స్ ని ఇన్స్టాల్ చేసుకోకండి

మనలో చాలామంది డబ్బు సంపాదించడానికి వాళ్ల వాళ్ల మొబైల్ లో కొన్ని మనీ ఎర్నింగ్ యాప్స్ కి సంబంధించిన ఫైల్స్ ని ఇంస్టాల్ చేసుకుంటారు ఒకవేళ మీరు మీ ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ చేస్తున్నట్లయితే లేదా మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇలాంటి ఆప్స్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడం మంచిది అలాగే మనలో చాలామంది వివిధ రకాల Apps నీ ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. ఈ Apps మనకు తెలీకుండానే మన దాటాను వాళ్లకు పంపిస్తూ ఉంటాయి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన App Permissions నీ ఆఫ్ చేయండి.
App Permissions
App Permissions
పైన కనిపిస్తున్న ఫోటోలో విధంగా యాప్ కి సంబంధించిన పరిమిషన్ మాత్రమే allow చేయండి. ఆప్ కి అవసరం లేని మిగతా పర్మిషన్స్ ని ఆఫ్ చేయండి దీని ద్వారా మీ డాటా వాళ్లకు చేరకుండా ఉంటుంది.అలాగే మీ ఫోన్ లో మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయిన ఏమైనా యాప్స్ ఉంటే చూసి వెంటనే uninstall చెయ్యండి.

Previous Post Next Post