The Next Big Thing in Tech IOT

టెక్నాలజీ రోజు రోజుకి మరింత అభిరుద్ది చెందుతూ వస్తుంది గత  వంద సంవత్సరాల్లో మన టెక్నాలజీ ఎంత అభిరుద్ది చెందిందో మీ అందరికి తెలిసిన విషయమే. మానవుడు ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు అభిరుద్ది చెందిన టెక్నాలజీ ఒక ఎత్తు అయితే రాబోయే పది సంవత్సరాల్లో రాబోయే టెక్నాలజీ ఒక ఎత్తు అనుకోవచ్చు. మరి  రాబోయే 10 సంవత్సరాల్లో వచ్చే టెక్నాలజీ లో ఒకటే ఈ IOT (Internet Of Things).
What is IOT in Telugu
Internet Of Things 

What is IOT? IOT అంటే ఏంటి ?

ఒక ప్రదేశం ఉన్న ఏదైనా ఒక పరికరాన్ని వేరొక ప్రదేశం నుండి sensors మరియు ఇంటర్నెట్ సహాయంతో అదుపు (control) లేదా చూడటాన్ని (Monitor) చేయడాన్ని టెక్నాలజీ పరంగా IOT అని అంటారు.
ఉదాహరణకు :  ఒక రోగి యొక్క గుండె (Heart) పని తీరును మన మొబైల్ లో చూడటం.
What is iot in telugu
IOT అంటే ఏంటి ?

IOT లో ముఖ్యపాత్ర పోషించేవి sensors. ఒక ప్రదేశం లో ఉనికిని తెలుసుకోడానికి ఈ sensors చాల బాగా ఉపయోగపడుతాయి. వివిధ రకాల సెన్సార్లు వివిధ రకాల సమాచారాన్ని చేరవేస్తాయి. అంటే మనం ఒక రోగి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుంది అని తెలుసుకోవాలి అంటే మనం heart beat sensor ని ఉపయోగించాలి. 

IOT ఎలా పని చేస్తుంది ?

Sensors నుండి వచ్చే data ని వేరొక చోటుకు పంపించడానికి మనకు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ పరికరం అవసరం, సాధారణంగా Microcontroller, Microprocessor లేదా ఎలక్ట్రానిక్ బోర్డ్స్ (Arduino or Rasberry Pi or ESP 8266) ని వాడుతారు. వీటి సహాయం తో సెన్సార్లు నుండి వచ్చే డాటా ని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం లో ఉన్న ఏ చోటుకైనా పంపించచ్చు.
Arduino
Arduino

IOT మన భవిషత్తు ని ఎలా మార్చబోతుంది ?

IOT in Telugu
IOT in Future

 ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా మన మనుగడ ఎంత సులభం అయిందో మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే పది సంవత్సరాల్లో మానవ మనుగడ ఇంకా సులభంగా మారుతుంది. మనం ఏ పనైనా ఇంట్లో ఉంటె ఒక్క చిన్న క్లిక్స్ ద్వారా పూర్తిచేసుకోవచ్చు. పరిశ్రమల్లో robots సహాయం తో పనులను నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. IOT ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయ్ అందులో ఒక్కటే నిరుద్యోగం. ఇప్పటికే 
లక్షల కొంది ఉన్న నిరుద్యోగులు భవిషత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది.
టెక్నాలజీ మనకు ఎంత మేలు చేస్తుందో అంత నష్టం కూడా చేసుతుంది.

Previous Post Next Post