Why we need earphones to listen FM in Mobiles

Mobiles లో FM వినాలి అంటే Earphones ఎందుకు అవసరం ?

            మనం మన జీవితంలో ఎప్పుడో ఒక్క సరైన FM ని వినేఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం earphones వాడినప్పుడు మాత్రమే మన మొబైల్ లో FM ఎందుకు వస్తుంది అన్ని మరి దానికి గలా కారకాలు ఏంటో మీకు తెలుసా ఒక వేళా తెలియక పోయినట్టైతే మరేం పర్వాలేదు ఇప్పుడు మీకు ఆ సందేహాలన్నిటిని clear చేస్తా.
FM In Mobiles
Source: Flipkart

FM  సిగ్నల్స్ ఎలా తయారవుతాయి ?

            FM స్టేషన్ లలో  మనం మాట్లాడే శబ్ద తరంగాలను ఆధారంగాచేసుకొని కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో శబ్ద తరంగాలని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లోకి మారుస్తారు. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఒక ఆంటిన్నా సహాయంతో విద్యుత్ అయస్కంథా తరంగలోకి మారుస్తారు. ఈ తరంగాలు చుట్టుపక్కల 50 నుండి 70 కిలోమీటర్ల దూరం వరకు విస్తరిస్తాయి. కావున ఈ ప్రాతంలో ఉన్న ప్రజలు తమ రేడియోస్ మరియు మొబైల్స్ సాయం ద్వారా ఈ సిగ్నల్స్ ని Receive చేసుకొని తమకు నచ్చిన కార్యక్రమాలను వినగలుగుతారు.

FM in Mobiles

          మన దగ్గర రేడియో ఉంటె వీటిని సులువుగా వినచ్చు కానీ మారుతున్న ఈ ప్రపంచాన్ని బట్టి రేడియో కూడా మనకు మనం వాడే మొబైల్స్ లోనే నిక్షితమైవుంది. కానీ మనం మన మొబైల్స్ లో FM వినాలి అంటే మనం మనం ఫోన్ లో ఏఆర్ఫన్స్ ని పెడితే కానీ ఈ రేడియో ఆన్ అవ్వదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది? సాధారణంగా FM సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవాలి అంటే మనకు ఒక మీటర్ పొడవు గల ఆంటిన్నా అవసరం ఉంటుంది దీన్ని రేడియోస్ లో అయితే ఎలాంటి ఇబంది లేకుండా పెట్టవచ్చు కానీ మొబైల్స్ లో ఈ మీటర్ పొడవున్న ఆంటిన్నా ని నిర్మించడం వాళ్ళ మొబైల్ size and weight పెరుగుతాయి కావున మనకు ఈ ఆంటిన్నా మనకు అందుబాటులో లేదు అందుకని ఈ ఏఆర్ఫన్స్ ని వాడినప్పుడు మాత్రమే మనకు FM రావడం జరుగుతుంది.
            మనం వాడే earphones copper అనే ఒక లోహంతో తాయారు చెయ్యబడుతుంది కావున ఈ Copper wire మనకి ఒక ఆంటిన్నా లాగ ఏర్పడి మన ఫోన్ లోకి ఈ FM సిగ్నల్స్ ని పంపిస్తుంది తద్వారా మనం FM ని వినగలుగుతున్నాం.

FM without Earphones

           మనం earphones లేకుండా కూడా FM ని వినగలం కానీ అది అన్ని మొబైల్స్ లో సాధ్యం కాదు ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం వాడే మొబైల్స్ లో ఒక్క మీటర్ పొడవున్న ఆంటిన్నా ఉండదు కాబట్టి కానీ కొన్ని మొబైల్ కంపెనీస్ వాళ్ళు కొన్ని మొబైల్స్ లో ఈ ఆంటిన్నా ని పెట్టి మార్కెట్ లోకి తీసుకు వచ్చారు కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు అందుకనే వాటికీ తాయారు చెయ్యడం ఆపేసాయి.
Previous Post Next Post