Top 5 YouTube Channels to Learn Programming

ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మనకు ఏదైనా ఒక ఉద్యోగం రావాలి అంటే మనకు తప్పకుండ ఏదోఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పకుండ వచ్చి తీరాలి అప్పుడు కానీ మనకు ఉద్యోగం రాదు అయితే మనలో చాలా మందికి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉంటుంది కానీ ఏక్కడ నేర్చుకోవాలో చాలామందికి తెలియదు కొందరు udemy, Coursera లాంటి ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో మనీ కట్టి మరి ప్రోగ్రాం నేర్చుకుంటారు. మీకు రూపాయి ఖర్చు లేకుండా  ఈరోజు నేను మీకు ఫ్రీగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడే Top 5 యూట్యూబ్ ఛానల్స్ గురించి ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం.

Top 5 YouTube Channels to Learn Programming
Top 5 YouTube Channels to Learn Programming

Top 5 YouTube Channels to Learn Programming

  1. Telusko 

                   Telusko Learnings  ఈ పదం మన తెలుగు పదం లాగా ఉన్న కానీ తెలుగు  కాదు. ఈ ఛానల్ లో మీకు చాలా మంచి కంటెంట్ లభిస్తుంది దీంతో మీరు చాలా ఈజీ గా ఎంజాయ్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ నడిపే అతని పేరు నవీన్ రెడ్డి ఇతను చెప్పే విధానం చాలా సాధారణంగా  బోర్  కొట్టకుండా ఉంటుంది ఇతని ఛానల్లో Python, javascript, Java  కి సంబంధించిన వీడియోస్ చాలా పాపులర్. ఒకవేళ మీరు Beginner అయినట్లయితే ఈ ఛానల్ ని తప్పకుండ ఫాలో అవ్వండి.
Telusko Learnings
Telusko Learnings 

    2. Hitesh Choudhary

                   Hitesh Choudhary ఇతని పేరు మరియు ఇతని యూట్యూబ్ ఛానల్ పేరు ఇతను కూడా ప్రోగ్రామింగ్ పై ఒక మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి ఇతను ను B.Tech కంప్యూటర్ సైన్స్ కాకపోయినప్పటికీ ఇతనికి ప్రోగ్రామింగ్ పైన  చాలా అనుభవం ఉంది. ఇతను తన ఛానల్లో javascript and Android Development  కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాడు ఇతను చెప్పే విధానం చాలామందికి ఇట్టే అర్థమైపోతుంది. మీలో ఎవరైనా javascript వెబ్ డెవలప్మెంట్ and Android డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే ఇతను చానల్ ki మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.
Hitesh Choudhary
Hitesh Choudhary

3. Programming with Mosh

             ఇతను వెబ్ డెవలప్మెంట్ మరియు ప్రోగ్రామింగ్ కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాడు ఇతను చానల్లో HTML , CSS , JAVASCRIPT, node.js వంటి ట్యుటోరియల్స్ చాలా ఫేమస్ ఇతను చెప్పే ప్రతి ఒక్క వీడియో గంట సేపటికి  మించి ఉంటుంది. ఎవరైతే ఉంటారో వాళ్లు ఒక్క వీడియో చూస్తే చాలు వాళ్లకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అందుకేనేమో ఇతనికి 675000++పైగా subscribers ఉన్నారు ఇతని పెట్టే ప్రతి వీడియోకి చాలా ఎక్కువ సంఖ్యలో వ్యూస్ ఉంటాయి మీరు కూడా వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇతని ఛానల్ ని కూడా పక్క సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి.
Programming with Mosh

             Programming with Mosh


4. Academind

          ఈ ఛానల్ లో మనకి వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించి Frontend  & Backend డిజైనింగ్కు సంబంధించి చాలా వీడియోస్ మనకి  ఫ్రీగా లభిస్తాయి. ఇతని ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో ఎవరికైనా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ గా ఉంటాయి ఇతను ప్రతి ఒక్కటి అర్థం అయ్యేలా చేస్తాడు. అలాగే మనం అడిగే డౌట్స్ కి అతను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాడు ఇతని చానల్లో node.js, Angular.js, React.js కి సంబంధించిన వీడియోస్ చాలా ఫేమస్. మీరు వెబ్ అప్లికేషన్స్ మరియు వెబ్సైట్లు చెయ్యాలి అనుకుంటే ఈ  ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తీరాలి ఎందుకంటే ఇతను చెప్పే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Academind

Academind


5. FreeCodeCamp.org 

FreeCodeCamp.org  ఈ యూట్యూబ్ ఛానల్ లో మీకు ప్రోగ్రామ్ కి సంబంధించిన ఏ టు జెడ్ వీడియోస్ ఇందులో లభిస్తాయి ఇందులో మీకు Game Designing, SQL, Data Science కి సంబంధించిన వీడియోస్ చాలా ఫేమస్ మీలో ఎవరైనా వీటిని  నేర్చుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండ ఈ ఛానల్స ని బ్స్క్రైబ్ చేసుకోండి.
FreeCodeCamp.org

FreeCodeCamp.org


ఈ పైన చెప్పబడిన యూట్యూబ్ ఛానల్ పేర్లు నా అనుభవం ద్వారా  నాకు తెలిసిన చానెల్స్ మాత్రమే. మీకు నచ్చిన చానెల్స్  ఎం ఐన ఉంటె నాకు నిర్మొహమాటంగా తెలుపగలరు.
Previous Post Next Post