Why Earphones have 1,2 Rings while other have Three Rings

మనం మొబైల్ లో పాటలు వినడానికి హెడ్ ఫోన్స్ లేదా ఏర్ ఫోన్స్ ని వాడుతాం అలాగే ఏదైనా ఒక సౌండ్ ని రికార్డ్ చేయడానికి మైక్ ని వాడదాం మీరు ఎప్పుడైనా గమనించారా 3.5mm jack పై ఉన్న రింగ్స్ నీ ఎందుకలా కొన్నిటికి ఒకటే రింగ్ లేదా కట్  ఉంటుంది కొన్నిటికి రెండు రింగ్స్ ఉంటాయి అలాగే కొన్నిటికి మూడు రింగ్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా అయితే ఈ రోజు నేను మీకు దీని వెనకాల ఉన్న రహస్యాలు మరియు కారణాలను నేను మీకు వివరిస్తాను.
HeadPhones
Ear Phones


Types of Audio Jacks Depends on No. Rings

  1. MonoRing 
  2. TRS  (stereo)
  3. TRRS (stereo with Mic)

Mono Ring 

ముందుగా mono రింగ్ జాక్ Mono  అంటే ఒకటి అని అర్థం. అంటే ఈ రింగ్ ఉన్న headset లో  songs మనకి 2 ఇయర్ ఫోన్స్ దగ్గర ఒకటే సౌండ్ వినిపిస్తుంది అని అర్థం అలాగే ఏదైనా ఒక Mic కి కూడా ఒక్కటే రింగ్ ఉన్నట్టయితే ఆ మైక్ స్టీరియో సౌండ్ రికార్డ్ చేయదు అని అర్థం.

TRS Jack 

ఇప్పుడు TRS హెడ్ఫోన్ జాక్ గురించి చూద్దాం ఈ హెడ్ఫోన్ జాక్ మనకి స్టీరియో సౌండ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగ పడుతుంది అంటే పైనున్న రింగ్ ఎడమ వైపుకి సంబంధించిన శబ్దాలను రికార్డ్ చేస్తే కింద ఉన్న రింగ్ కుడి వైపుకు ఉన్న శబ్దాలను రికార్డు చేస్తుంది అలాగే హెడ్ ఫోన్స్ లో కూడా ఎడమవైపున శబ్దాలు ఎడమవైపుకి కుడివైపు ఉన్న శబ్దాలు కుడివైపు earphone లో వినిపిస్తాయి. దీన్నే మనం stereo effect అంటాం, ఇలా ఈ రెండు ఉండడం ద్వారానే మనం stereo effect ని పొందగలుగుతున్నాం. ఒకవేళ మన హెడ్ఫోన్ జాక్ కి 2 రింగ్స్ కనుక లేకపోతే మనం ఈ స్టీల్ ఎఫెక్ట్ ని వినలేం.
TRS headphone jack
stereo jack

TRRS 

stereo jack with Mic
stereo jack with Mic

ఇక మూడు రింగ్స్ ఉన్న హెడ్ఫోన్ జాక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ మూడు రింగ్స్ ఉన్న హెడ్ఫోన్ జాక్ ని మీరు బాగా పరీక్షించినట్లైతే అక్కడ మీకు మైక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మీరు ఏ earphone  తీసుకున్నా కూడా దానికి 3 rings  ఉన్నట్టయితే దానికి Mic తప్పనిసరిగా ఉంటుంది.
TRRS jack
TRRS jack

అయితే ఇందులో పైనఉన్న భాగం ఎడమవైపున శబ్దాలను వేరు చేస్తుంది రెండోవ భాగం కుడివైపున శబ్దాలను వేరు చేస్తుంది మూడవ భాగం Ground లాగా పనిచేస్తుంది మరియు 4 వ భాగం మనకి Mic లాగా పనిచేస్తుంది ఈ 3 rings  లేకపోతే మనకు మైక్ అనేది సపోర్ట్ చెయ్యదు.
ఇప్పుడు నీకు అర్థం అయిపోయింది కదా మన హెడ్ఫోన్ జాక్ ఉన్న రింగ్స్ వెనకాల గల కారణాలు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు బంధువులు మిత్రులతో పంచుకోండి మరిన్ని ఆర్టికల్స్ కోసం మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి థాంక్యూ
 Watch the video

https://youtu.be/uCPJf2thuDk


Telegram Channel లో చేరండి.
WhatsApp గ్రూప్ లో చేరండి.
Previous Post Next Post